రోడ్డు ప్రమాదంలో ఎమిరేటీ పోయెట్‌ మృతి

- April 16, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఎమిరేటీ పోయెట్‌ మృతి

 ప్రముఖ ఎమిరేటీ పోయెట్‌ నైయా ఒబైద్‌ అల్‌ ఖాయిది, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. షార్జా రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అల్‌ ధైద్‌ నుంచి కారులో ప్రయాణిస్తుండగా, నియంత్రణ కోల్పోవడంతో వాహనం ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి పోలీసులు బయల్దేరి వెళ్ళారు. బ్రిడ్స్‌ 11 మరియు బ్రిడ్జి 12 మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ పోయెట్‌ మృతి చెందాడన్న వార్తతో ఆయన అభిమానులు షాక్‌కి గురయ్యారు. సోషల్‌ మీడియాలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఆయన అభిమానులు, ప్రముఖులు. నైయా ఒబైద్‌ అల్‌ ఖాయిది పార్తీవ దేహానికి అల్‌ కువైస్‌ మాస్క్‌ వద్ద ఫ్యునరల్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, అల్‌ ఖైదీరా సిమిటరీలో అంత్యక్రియలు జరుపుతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com