నేడు నటి 'సౌందర్య' వర్ధంతి
- April 17, 2017
రైతు భారతం' సినిమాలో మొదట నటించినా 'మనవరాలి పెళ్లి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన సౌందర్య ఓ దశాబ్దం పాటు నంబర్ వన్ స్థానంలో ఇండస్ట్రీని ఏలింది. తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షిణాది సినిమాలతో పాటు హిందీ బాషల్లో కూడా హీరోయిన్ గా వందకు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్య, తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసింది. 2004 ఏప్రిల్ 17న యాక్సిడెంట్ కి గురై 31 ఏళ్ల చిన్న వయస్సులోనే మృతిచెందిన సౌందర్య వర్ధంతి నేడు..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకొన్న సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమాను ఏలింది.. కన్నడ నిర్మాత కూతురు అయిన సౌందర్య అసలు పేరు సౌమ్య చాలా చిన్న వయసులోనే తెరంగేట్రం చేసింది సౌందర్య. టాలీవుడ్ కి మాత్రం త్రిపురనేని వారి రైతు భారతం చిత్రంతో పరిచయం అయ్యింది. కానీ విడుదలైన తొలి చిత్రం మాత్రం మనవరాలి పెళ్లి. కానీ హీరోయిన్ గా సౌందర్యకు గుర్తింపు తెచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు. సౌందర్య వరుసగా ఆఫర్లు తో నంబర్ వన్, మాయలోడు, మేడమ్, టాప్ హీరో, అల్లరి ప్రేమికుడు, అమ్మదొంగ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు అప్పట్లో భారీ హిట్స్ గా నిలవకపోయినా సౌందర్యకి మాత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. కాగా అక్కినేని నాగార్జున హీరోగా ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్ తో తొలి భారీ హిట్ ను అందుకొన్నది.. ఈ సినిమాలో సౌందర్య నటన తో పాటు గ్లామర్ కు కూడా జనం ఫిదా అయిపోయారు. ఇక సౌందర్య కి 1995లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మెరు స్పెషల్ ఇమేజ్ ను తెచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా, మహిళా ప్రేక్షకుల్లో సౌందర్యపై అభిమానం పెరగడానికి కారణం అమ్మోరు చిత్రమే. ఈ మూవీలో సౌందర్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమ్మోరులో నటనకు గానూ, నంది అవార్డ్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా సౌందర్యకు దక్కింది.
అంతేకాదు.. మోహన్ బాబు సినీ చరిత్రలో అపూర్వ విజయంగా చెప్పుకునే పెదరాయుడు సినిమాలో సౌందర్య పాత్ర టూ షేడ్స్ లో నడుస్తుంది. పొగరుబోతు కోడలుగానూ...అత్తింటి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకున్న గృహిణిగానూ రెండు విభిన్న ధోరణుల్నీ అద్భుతంగా నటించి మెప్పించింది. నిజానికి పెదరాయుడు విజయంలో సౌందర్యకూ భాగం ఉంది. ఈ విషయం సాక్షాత్తూ మోహన్ బాబే అంగీకరించడం విశేషం.
పవిత్ర బంధంలో మానసిక సంఘర్షణకు గురయ్యే మధ్యతరగతి యువతి పాత్రలో సౌందర్య సహజంగా ఉంటుంది.. చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలతో పాటు చిన్న హీరోలతోనూ సినిమాలు చెయ్యడం సౌందర్య స్పెషల్.. అంత:పురం లో ఆత్మస్ధైర్యం ఉన్న మహిళగా పరిస్థితులను ఎదిరించి తను ఎంచుకున్న జీవితం వైపు నడిచివెళ్లిపోయే పాత్రలో సౌందర్య జీవించేసింది.
సినిమా మీద ఉన్న పాషన్ తోనే సౌందర్య నిర్మాతగా కూడా మారారు. కన్నడంలో ద్వీప అనే సినిమా తీశారు. ఈ మూవీ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సౌందర్య నటించిన చివరి చిత్రం కన్నడలో తెరకెక్కిన ఆప్తమిత్ర. ఈ మూవీలో పెర్ఫార్మెన్స్ కి సౌందర్య స్టేట్ అవార్డ్స్ దక్కాయి. అదే క్రమంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన సౌందర్య 2004 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పక్షాన ప్రచారం నిర్వహిస్తూ...హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూయడం విషాదం. సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సినిమాలతో మన మధ్యనే ఉన్నది.. అందుకే కళాకారుడు.. మరణించీ చిరంజీవి అని అంటారేమో మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







