మానసికం

- October 01, 2015 , by Maagulf

నా కన్నులు నీ రూపాన్ని 
​నా  హ్రుదిలోకి పంపే క్షణాన 
మదిలోని   భావ జాల ఊట
నా  మనసును తడిపేస్తుంది   

నువ్వు  ప్రక్కనుండి వెళుతూ 
ఉన్నప్పుడు,నా మేను చిరు 
చెమట తో  ప్రకంపనలు చెంది 
పులకించి పోతుంది 
పూల సౌరభాలు వెదజల్లు
నిన్ను శ్వాసించి,

అప్పుడు మన స్పందన రసాయినికమా 

మరి ఇప్పుడు,నేను రాలేనని రానని

అలాగే నన్ను కవ్వించ నీవూ.. రాలేవని,
నీకు నాకు మధ్య,భాద్యతలు 
బరువులు పెరిగాయని  

అప్పటి లా మనం కలిసి దగ్గరగా 
సహజీవనం చేయ లేమని
తెలిసినా ఎందుకు ఇంకా మనకు 
ఈ ఆరాటాలు 

ఇంకను ప్రేమ కుసుమక్షరాలు ఒకరిపై 
ఒకరం చల్లుకోవాలని చూడటం ఎందుకు?

అయినా ఎప్పుడో,మన పెద్దలు చెప్పారుగా 
ప్రేమ శారీరకం,రసాయినికం అయినా 
అది మానసికం కూడా అని 

ఎవరేమనుకున్నా 
మనం మనలాగే 
నిజమైన మానసికంగానే 
కాపురముందాం. 


--బోడ జయ రెడ్డి(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com