బాహుబలి 2 టికెట్స్ యూఎస్ లో చుక్కలను తాకుతున్నాయి
- April 21, 2017
జక్కన్న చెక్కిన శిల్పం బాహుబలి.. సినిమా .. బాహుబలి 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 28 న రిలీజ్ కానున్న ఈ సినిమా అమెరికాలో కూడా సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది.. ఈ నేపద్యంలో ఈనెల 27న ప్రీమియర్ షో గా 28 న అధికారికంగా రిలీజ్ చెయ్యడానికి సన్నాహల్లో ఉన్నారు.. గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ అధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఈ సినిమా టికెట్ ధర కొండకెక్కింది.. బాహుబలి సీక్వెల్ ను 27 న ప్రీమియర్ షో ప్రదర్శిస్తుండగా.. ప్రీమియర్ షో ఐమాక్స్ లో పన్నులతో కలుపుకొని 43 డాలర్లు టికెట్ ధర కాగా ... మామూలు తెరపై 32 డాలర్లు పెట్టారు.. ఇక రిలీజ్ రోజైన 28 న ఐమాక్స్ లో 35 డాలర్లు, మామూలు తెరపై 25 గా నిర్ణయించారు. దీంతో టికెట్ ధర ఆకాశం ను తాకుతుండడంతో ప్రేక్షకులకు కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయం పై ప్రేక్షకులు స్పందిస్తూ.. బాహుబలి 2 సినిమా హక్కులను ఓవర్సీస్ పంపిణీదారులు ఎంతకు కొనుగోలు చేశారో తెలియదు కానీ తమ పెట్టుబడి మూడురోజుల్లోనే రాబట్టుకోవాలని దురాశ తో ఇలా చేస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాను థియేటర్లలో చూడాలి అని భావించి జేబుకు చిల్లు పెట్టుకోవడం కంటే పైరసీలో చూస్తే పోలే అని ప్రేక్షకులు ఇందుకే భావిస్తున్నారేమో అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







