ఏపీఎస్ఆర్టీసీ లో కరోనా ఏసీ బస్సులు ప్రారంభం
- April 21, 2017
ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన కరోనా గరుడ ఏసీ బస్సులను రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలో ప్రారంభించారు. మొత్తం 15 బస్సులు రెండు వారాల క్రితమే విజయవాడ చేరుకోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం కిందటే పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీకి నష్టాలు కొత్తేమి కాదని, ప్రణాళికాబద్ధంగా పనిచేసి వాటిని అధిగమిస్తామని అన్నారు. కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తే నష్టాల నుంచి గట్టెక్కించవచ్చన్నారు.
ప్రైవేటు బస్సుల నుంచి పోటీ ఉన్నప్పటికీ పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ఆర్టీసీ లాభాల బాట పట్టవచ్చన్నారు. కాగా, 11 సర్వీసులను కృష్ణా రీజియన్‌కు, మిగతా వాటిని ఇతర రీజియన్లకు కేటాయించనున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు 9, బెంగళూరుకు 4, చెన్నైకి 2 ఏసీ బస్సులు నడుపుతారు. మంత్రి దేవినేని ఉమ, అధికారులను ఎక్కించుకుని మంత్రి అచ్చెన్నాయుడు కొద్దిసేపు బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







