జూన్ 23న రిలీజ్ కాబోతున్న 'నిన్నుకోరి'
- April 22, 2017
నాని నటిస్తున్న తాజా చిత్రం నిన్నుకోరి. ఇందులో నాని సరసన నివేదాథామస్ కథానాయికగా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకుడు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్.ఎల్.పి. పతాకాలపై దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ, ఆ మధ్య అమెరికాలో ఈ చిత్రం భారీ షెడ్యూల్ చేశాం. ఏప్రిల్ 17 నుంచి వైజాగ్‌లో చిత్రీకరణను జరుపుతున్నాం. ఈ నెల 29 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ మినహా చిత్రం పూర్తవుతుంది. జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రంలోని కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తుండగా, ఇతర పాత్రల్లో మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వి, రాజశ్రీ నాయర్, నీతు, భూపాల్‌రాజ్, కేదార్‌శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: చిన్నా.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







