'ఇద్దరి మధ్య 18':మూవీ రివ్యూ

- April 22, 2017 , by Maagulf
'ఇద్దరి మధ్య 18':మూవీ రివ్యూ

ఇద్దరి మధ్య 18 మూవీ రివ్యూ…
నటీనటులు : రామ్ కార్తీక్, భాను త్రిపాఠి
సంగీతం : గంటాడి కృష్ణ
దర్శకత్వం : నాని ఆచార్య
నిర్మాత : శివరాజ్ పాటిల్
విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2017
రామ్ కార్తీక్, భాను త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఇద్ద‌రి మ‌ధ్య 18. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందొ తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చ‌దవాల్సిందే..
కథ:
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన మహి (రామ్ కార్తీక్), హిమ (భాను త్రిపాఠి) అరకు వ్యాలీలో జరిగే ఒక ఇండస్ట్రియల్ టూర్లో కలుసుకుంటారు. అక్కడే ఒకరికొకరు బాగా దగ్గరై ఒకే ప్రాజెక్ట్ ను తీసుకుంటారు. అదే జాతీయ భద్రతా అంశాలతో ముడిపడి ఉన్న మిషన్ 18. ఆ మిషన్ ప్రత్యేకత ఏమిటి ? దాన్ని మహి, హిమ లు విజయవంతంగా పూర్తి చేశారా ? ఆ ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? అనేదే ఈ సినిమా కథ. 
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు నాని ఆచార్య సినిమా ద్వారా ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం, దేశం పట్ల అతనికున్న భాద్యత మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి. హీరో రామ్ కార్తీక్ తన నటనతో పర్వాలేదనిపించినా హీరోయిన్ పాత్రలో భాను త్రిపాఠి మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చింది.
హీరోయిన్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ చాలా బాగుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. యాంకర్ బిత్తిరి సత్తి తన తెలంగాణ యాసతో, నాటాతో అక్కడక్కడా మెప్పించాడు. సినిమాలోని మొదటి పాటను అరకు లొకేషన్లలో చాల బాగా చిత్రీకరించారు.
సాంకేతిక విభాగం :
కథ బాగున్నా కూడా దర్శకుడు నాని ఆచార్య‌ దాన్ని మంచి మంచి కథనంతో, బ్యాక్ డ్రాప్ తో ఆసక్తికరంగా రూపొందించడంలో విఫలమయ్యాడు. లాజిక్ లేకుండా వ‌చ్చే స‌న్నివేశాలు.. వాటికి ముగింపు లేని దృశ్యాలు ఇబ్బందిపెడ‌తాయిజి. ఎల్ బాలు సినిమాటోగ్రఫి బాగుంది. అరకు లోయలోని సహజ అందాలను చాలా బాగా చూపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చెప్పుకోదగగ స్థాయిలో లేదు. గంటాడి కృష్ణ సంగీతం పర్వాలేదనిపించింది. నాలుగింటిలో రెండు పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
కామెంట్ః లాజిక్ లేని మూవీ
రేటింగ్ః 1.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com