బాహుబలి2 ఇండియా టుడే కవర్ పై
- April 22, 2017
బాహుబలి2.. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసేస్తుందనే అంచనాల మధ్య.. మరో ఆరు రోజుల్లో రిలీజ్ కానుంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు. అసలు ఈ సినిమాకు ముందు వెనకా వేరే ఏ సినిమా.. ఏ భాషలోనూ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సాహసించడం లేదంటే బాహుబలి2 రేంజ్ అర్ధమవుతుంది. ఇండియాటుడే మేగజైన్.. తాజా ఎడిషన్ కవర్ పేజ్ పై బాహుబలి కనిపించింది. బాహుబలి ప్రభాస్ ఏనుగు మీదకు తొండంపై నుంచి ఎక్కుతున్న పోస్టర్ ను కవర్ పేజ్ పై వేశారు. పొలిటికల్ మేగజైన్ అయినా..
ట్రెండీ అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఇండియా టుడే.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న బాహుబలి గురించి స్పెషల్ కవరేజ్ ఫీచర్ ను ప్రచురించింది. ఒక తెలుగు సినిమా.. దేశవ్యాప్తంగా హాట్ హాట్ సాగుతున్న రాజకీయాలను కూడా పక్కకు నెట్టి కవర్ పేజ్ పై ఎక్కడం అంటే చిన్న విషయం కాదు.
కానీ బాహుబలికి ఆ స్థాయి ఉంది. ఇది తెలుగు మూవీకి లభించిన అరుదైన గౌరవం..
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







