బేబి ఆడియో సుమన్ చేతుల మీదుగా
- April 22, 2017
సీనియర్ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కథానాయకుడిగా, షిరాగార్గ్, అంజలిరావు కథానాయికలుగా, బేబి శాతన్య, బేబి శ్రీవర్షిని ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం బేబి. డి.సురేష్ దర్శకత్వంలో తమి ళంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి పాలపర్తి శివకుమార్ శర్మ సమర్పణలో సాయిప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.వి.ఎన్.పవన్‌కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్, హరీష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ ఆడియో సీడీలను నటుడు సుమన్ , ఆడియో సీడీలను ఆర్.పి.పట్నాయక్ విడుదలచేసి, తొలి సీడీని సుమన్‌కు అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, భారతీరాజా అబ్బాయి మనోజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతుండటం ఆనందంగా ఉంది. పాటలతో పాటు ఈ చిత్రం ట్రైలర్స్ కూడా బావున్నాయి అని అన్నారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, ట్రైలర్‌లోని హారర్ అంశాలను చూస్తుంటే ఉత్కంఠ కలుగుతోందని చెప్పారు. ఇంకో అతిథి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్లు దొరుకుతూనే ఉన్నాయని అన్నారు.
పలు చిత్రాలను రూపొందించిన సీనియర్ దర్శక, నిర్మాత శ్రీరంగం సతీష్‌కుమార్ ఈ చిత్ర నిర్మాతలకు వెన్నుదన్నుగా నిలవడం అభినందనీయమని అన్నారు. శ్రీరంగం సతీష్‌కుమార్ మాట్లాడుతూ, ఎంతో అభిరుచితో ఈ చిత్ర నిర్మాతలు సినీరంగంలోనికి ప్రవేశించారని అన్నారు. గీత రచయిత చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, మదర్ సెంటిమెంట్, హారర్ అంశాల సమ్మేళనంతో ఈ చిత్రాన్ని రూపొందించారని, పాటలతో పాటు రీరికార్డింగ్ కూడా అలరింపజేస్తుందని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సాయివెంకట్, రమేష్ పిశాచి-2 చిత్రం ఫేమ్ శిప్రాగౌర్, చిత్ర సమర్పకుడు పాలపర్తి శివకుమార్‌శర్మ, సహ నిర్మాతలు బత్తుల కూర్మయ్య, బత్తుల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







