రీ-షూట్ చేస్తున్న సర్కార్ - 3
- April 24, 2017
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'సర్కార్ - 3'. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడా కారణాలేంటీ ? అనేది వెలుగులోకి వచ్చాయి. సినిమాలో కొన్ని షాట్స్ అనుకొన్న రేంజ్ లో రాలేదట. దీంతో.. పలుమార్లు చర్చల తర్వాత ఆ సీన్స్ ని రీ-షూట్ చేయాలని దర్శకుడు వర్మ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సీన్స్ ని రీ-షూట్ చేస్తున్నారు.
గతంలో 'సర్కార్'తో బిగ్ బీకి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చాడు వర్మ. అయితే, సర్కార్ సీక్వెల్ గా వచ్చిన సర్కార్ - 2 నిరాశపరిచింది. ఇప్పుడు సర్కార్
సిరీస్ లో 3వ భాగం వస్తుంది. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత సర్కార్ -3 కోసం రీ-షూట్స్ నిర్వహించడం ఎక్కడో అనుమానాలకి తావునిస్తోంది.
నిన్నామొన్నటి వరకు టాలీవుడ్ లో తికాన వేసిన రాంగోపాల్ వర్మ. ఇక్కడ వరుస ప్లాపులని ఖాతాలో వేసుకొన్నాడు. ప్లాపుల్లో ఉండగానే బాలీవుడ్ చెక్కేసి ఏకంగా బిగ్ బీ అమితాబ్ తో సర్కార్ - 3 మొదలెట్టాడు. ఇప్పుడు సర్కార్ - 3 ఫలితం ఏమాత్రం తేడా కొట్టిన వర్మ బాలీవుడ్ ప్రయాణం ముళ్లమీద నడకే అవుతుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







