ఒమన్‌లో వాహన రిజిస్ట్రేషన్ల తగ్గుదల
- April 26, 2017
కొత్త ప్రైవేటు వాహనాలు (ఇంపోర్టెడ్ వాహనాలు కలుపుకుని) ఈ యేడాది మార్చి 31 వరకు చూసుకుంటే 751 మాత్రమే జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి పోల్చుకుంటే ఇది 23.4 శాతం తగ్గుదలగా కనిపిస్తోంది. కొత్త కమర్షియల్ వాహనాలకు సంబంధించి 3,596గా ఉంది. ఇది కూడా 38.4 శాతం తగ్గుదల నమోదు చేసింది గత ఏడాదితో పోల్చితే. ట్యాక్సీల రిజిస్ట్రేషన్ కూడా తగ్గింది. మొత్తం 99 వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇది 33.1 శాతం తగ్గుదలగా ఉంది. డిప్లమాటిక్ కార్ప్స్‌కి సంబంధించిన వాహనాలు 21.1 శాతానికి తగ్గింది. మార్చి నెలాఖరు నాటికి 15 వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మార్చ్ 31 చివరి నాటికి ఒమన్‌లో మొత్తం వాహనాల సంఖ్య 1,387,139గా ఉంది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు 18,797 వాహనాలు రిజిస్టర్ అయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడిస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







