బీపీ, ఒత్తిడిని నివారించే వాల్నట్స్
- April 26, 2017
వాల్నట్స్ (అక్రోటు కాయ)లు ఒత్తిడి, లో బీపీలను నివారించేందుకు ఉపయోగపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే బాదంపప్పు ఒత్తిడి, రక్తపోటులను కూడా నియంత్రిస్తుందని అమెరికా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
దీనిపై మూడు వారాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో వాల్నట్స్ తీసుకోవడం ద్వారా లో బీపీ, ఒత్తిడిని కొంతమేరకు నివారించవచ్చని తేలింది. అంతేగాకుండా హృద్రోగ వ్యాధులు కూడా నయమవుతాయని ప్రొఫెసర్ షీలా తెలిపారు. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు కూడా వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని అధ్యయనంలో తేలింది.
ఈ పరిశోధనలను మూడు రకాలుగా చేశారు. ఒకటి వాల్నట్స్ లేకుండా, మరొకటి వాల్‌నట్స్‌తో, ఇంకొకటి వాల్నట్స్, ఫ్లెక్సీడ్ ఆయిల్‌తో చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. లో బీపీతో బాధపడుతూ వాల్‌నట్స్‌ను ఉపయోగించిన వారిలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కూడా ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







