పోలీస్ గా కనిపించనున్న సందీప్ కిషన్ నక్షత్రం సినిమా లో
- April 26, 2017
పోలీస్ ఆఫీసర్ కావాలనే ప్రయత్నించే ఓ యువకుని కథతో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'నక్షత్రం'. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఓ ప్రముఖ కథానాయికపై ఆ పాటను త్వరలోనే చిత్రీకరిస్తామని చిత్రనిర్మాతలు కె.శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు చెప్పారు. సినిమాలో సాయిధరమ్ తేజ్ పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతో అలరిస్తుందని చెప్పారు. చిత్రం టీజర్ విడుదలను ఓ వేడుకగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మేలో ఆడియోను, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తులసి, జెడీ చక్రవర్తి, ప్రకాశ్‌రాజ్, శివాజీరాజా, రఘుబాబు, తనీశ్, ముక్తర్‌ఖాన్, సాయికిరణ్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, పాటలు: అనంతశ్రీరామ్, కాసర్ల శ్యామ్, ఫొటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







