సౌదీ సేఠ్ చెరలో నుంచి రేణుకను రప్పిస్తాం: నన్నపనేని
- April 26, 2017
సౌదీ సేఠ్ చెరలో ఉన్న జయచంద్ర భార్య రేణుకను స్వదేశానికి రప్పిస్తామని మహిళా కమిషన చైర్‌పర్సన నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో గత శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో 15మంది మృతి చెందడం, వీరిలో 12మంది ఒక్క మునగలపాళెం గ్రామస్తులే కావడం తెలిసిందే. నన్నపనేని రాజకుమారి బుధవారం మునగలపాళెంలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇదే ఘటనలో మరణించిన జయచంద్ర తల్లి సుభద్రమ్మ, కుటుంబసభ్యులతో మాట్లాడారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలోని సేఠ్ చెరలో ఉ న్నారని..కడచూపులకు కూడా ఆమె రాలేకపోయిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రేణుకను స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







