బాహుబలి టికెట్ ఉచితం గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే
- April 26, 2017
ఏప్రిల్ 28న విడుదలవుతున్న బాహుబలి 2 చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతకా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 8వేల థియేటర్లకు పైగా విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వారం రోజుల టికెట్లు కూడా బుక్కైపోయాయి.
కాగా, బాహుబలి2 చిత్రానికి ఉన్న క్రేజ్ ను పలు సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఓ గ్యాస్ ఏజెన్సీ ఏకంగా సంచలన ప్రకటన చేసింది. వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి బాహుబలి-2 సినిమా టికెట్‌ను ఉచితంగా ఇస్తామంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని హెచ్‌పీ గ్యాస్ డీలర్ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ఈ బంపరాఫర్ ప్రకటించింది.
అంతేకాదు ఈ విషయాన్ని తెలుపుతూ పెద్దపెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఏప్రిల్ 30లోపు కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మెలిక పెట్టింది కూడా.
దుగ్గిరాల, రేవేంద్రపాడు గ్రామాల్లోని సినిమా హాళ్లలో ప్రదర్శితమయ్యే సినిమా టికెట్లను కనెక్షన్‌తోపాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాస్ తెలిపారు. దీంతో పలువురు సినీ అభిమానులు గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







