ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌కే.విశ్వనాథన్ కన్నుమూత
- April 26, 2017
ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌కే.విశ్వనాథన్(75) మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు నటులు కమలహాసన్, సత్యరాజ్, పాండ్యరాజన్, సంగిలి మురుగన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి సహా పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు.
చట్టం ఎన్ కైయిల్, కడల్ మీన్‌గల్, మీన్‌డుం కోకిల, సగాదేవన్ మగాదేవన్ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఎన్‌కె.విశ్వనాథన్, తరువాత విజయకాంత్ నటించిన పెరియమరుదు, నమితం, వడివేలు నటించిన జగన్మోహిని, రామ్‌కి, నిరోషా నటించిన ఇనైంద కైగల్ వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి బుధవారం పోరూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి డీఎండీకే నేత విజయకాంత్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







