రెబెల్ స్టార్ ప్రభాస్ నూతన చిత్రం 'సాహో'
- April 27, 2017
ఒక్క మాటలో చెప్పాలంటే సాహో టీజర్ అదిరిపోయింది. డైలాగ్ మాసీగా ఉన్నా, దాన్ని తీసిన విధానం యమ క్లాసీగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే స్పైడర్ మాన్ బ్యాట్‌మెన్ టైపు సినిమా ఏమో అనిపించకమానదు. సాహో టైటిల్, ప్రభాస్ డైలాగ్, దాన్ని కట్ చేసిన విధానం చూస్తుంటే కచ్చితంగా సాహోపై భారీ అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుక్రవారం పండగ అనుకొన్నారు. కానీ పండగ సాహో టీజర్‌తో ఓ రోజు ముందుగానే మొదలైపోయింది.
బాహుబలి 2తో పాటు సాహో టీజర్‌ని చూపించాలన్నది యువీ క్రియేషన్స్ ఆలోచన. అందుకే సినిమా మొదలై నెల రోజులు కూడా అవ్వకముందే టీజర్ రెడీ అయ్యింది. అయితే అనుకోకుండా ముందే లీకైపోయింది. ఇప్పుడు పూర్తి క్వాలిటీతో, అఫీషియల్‌గా చిత్రబృందం సాహో టీజర్‌ని విడుదల చేసింది.
గత ఐదేళ్లుగా 'బాహుబలి'ప్రాజెక్టులో లీనమైన ప్రభాస్ మరో సినిమా చేయని సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రంలో నటిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో 2018లో సరికొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తానంటూ కొత్త టీజర్‌తో ప్రభాస్ ప్రామిస్ చేశాడు.
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'సాహో' టీజర్ గురువారం అధికారికంగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ టీజర్లో ఏముందంటే..
ఓపెన్ చేస్తే, జూమ్ అవుట్... అవుట్... అవుట్... కట్ చేస్తే ప్రభాస్ కన్ను. మళ్లీ కొంచెం జూమ్ అవుట్ చేస్తే... ముఖంపై రక్తంతో ఓ కుర్చీలో కూర్చున్న ప్రభాస్! అప్పుడు ఓ డైలాగ్.
వాయిస్ ఓవర్ (విలన్) ఆ రక్తం చూస్తేనే అర్థమవుతుంది రా... వాణ్ణి చచ్చేంతలా కొట్టారని! (విలన్) అనుచరుడు సార్... అది వాడి రక్తం కాదు, మన వాళ్లది.
కుర్చీలో వెనక్కి పడి ఉన్న ప్రభాస్ మెల్లగా ముఖంపై రక్తాన్ని తుడుచు కుంటూ స్ట్రయిట్‌గా కూర్చుని డైలాగ్ చెబుతారు. అదేంటంటే...ప్రభాస్ ఇట్స్ షో టైమ్!
శంకర్-ఎహసన్-లాయ్ త్రయం అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







