మెగా స్టార్ గురించి కొన్ని నిజాలు
- April 27, 2017
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా 20 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీని ఏలాడు.. రాజకీయాల నుంచి తిరిగి దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి మెగాస్టార్ పై ఉన్న అభిమానం.. బాక్సాపీస్ వద్ద మెగాస్టార్ స్టామినా ఏమిటో తెలియజెప్పింది. కాగా చిరంజీవి మెగాస్టార్ గా బిరుదు అందుకోక ముందే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాడు.. ఏ దక్షిణాది హీరో అందుకొని అరుదైన అవకాశం అందుకొన్నాడు.. 1987 లో యుద్ధభూమి సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి కి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరవ్వాలని ఆహ్వానం అందింది.. అప్పటి వరకూ ఏ దక్షిణాది హీరోకి ఇంతటి గౌరవం దక్కలేదు.. దీంతో ఏ దక్షిణాది హీరోకి దక్కని గౌరవం దక్కించుకొన్న హీరో చిరంజీవి గా ఘనత దక్కించుకొన్నారు. ఇక ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచార్డ్ గేల్ భారత దేశం వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ని కలిసి చిరంజీవి ఇంట్లో ఆతిద్యం స్వీకరించాడట.. చిరంజీవి జీవితంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మరో విశేషం ఏమిటంటే.. హాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన స్టీవెస్ సీగల్ చిరంజీవిని కలిసి అనంతరం వారిద్దరూ పుట్టపర్తికి వెళ్లారట.. ఇంతటి గుర్తింపు చిరంజీవి మెగాస్టార్ ఇమేజ్ రాకముందే అందుకోవడం విశేషం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







