కొత్త వారితో సినిమా చేయనున్న శ్రీకాంత్ అడ్డాల
- April 28, 2017
శ్రీకాంత్ అడ్డాల కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగు పెట్టి... సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మళ్ళీ కుటుంబ నేపద్య కథలకు పట్టం కట్టేలా చెయ్యడమే కాదు.. మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఊపిరి పోశాడు.. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాలో మహేష్ నటనకు మంచి పేరు వచ్చింది.. దీంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం పై నమ్మకంతో మళ్ళీ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.. మహేష్ ఎంతో నమ్మితే గానీ అవకాశం ఇవ్వడు.. అటువంటి మహేష్ నమ్మకాన్ని బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ తో దెబ్బతీశాడు.. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ నిచ్చాడు. అర్ధం కానీ డైలాగ్స్, అర్ధం కానీ సీన్స్ తో చిరాకు పుట్టించాడు.. ఈ సినిమాతో మహేష్ ఇమేజ్ ను డామేజ్ చేశాడని పేరు తెచ్చుకొన్నాడు.. అంతకు ముందు ముకుంద వంటి సినిమా తో ప్లాప్ ఇచ్చినా కొంత మంది కి సినిమా చాలాబాగా నచ్చింది. కానీ బ్రహ్మోత్సవం సినిమాతో మాత్రం శ్రీకాంత్ అడ్డాల చెత్త సినిమా చేశాడనే టాక్ సొంతం చేసుకొన్నాడు.. అప్పటి నుంచి శ్రీకాంత్ పేరు వినిపించలేదు.. మెగా కాంపౌండ్ లో శ్రీకాంత్ కు అవకాశం ఉంది అనే వార్తలు మినహా మరే విధంగా శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపించడం లేదు.. కాగా శ్రీకాంత్ కొత్తవారితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.. ఈ సినిమాకి ఇప్పటికే టైటిల్ నిర్ణయించి రిజిస్టర్ చేయించినట్లు టాక్.. సైలెంట్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్న శ్రీకాంత్ కొత్తవారితో సినిమా చేసి తనని తను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







