దోచేయ్:రివ్యూ
- April 24, 2015
చిత్రం: దోచెయ్
నటీనటులు: నాగచైతన్య, కృతి సనోన్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, రావు రమేష్, రవిబాబు, సత్య, ప్రవీణ్ తదితరులు.
చాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: ఎం.ఆర్. సన్నీ
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: బివిఎస్‌ఎన్ ప్రసాద్
విడుదల తేదీ: 24 ఏప్రియల్ 2015
కథ
చందు (చైతన్య) తన తెలివితేటలతో చిన్న చిన్న మోసాలు చేసే కుర్రాడు. ఓ గ్యాంగ్‌ని ఏర్పాటు చేసుకుని, ఆ గ్యాంత్ ద్వారా చిన్న చిన్న మోసాలు చేసి సంపాదిస్తూ, తన చెల్లెల్ని చదివించుకుంటుంటాడు చందు. చందుకి మీరా (కృతి సోనన్) పరిచయమవుతుంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం కామన్ కదా. ఇక్కడా అదే జరుగుతుంది. సాఫీగా అంతా సాగిపోతుందనుకున్న సమయంలో చందుకి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరమవుతుంది. దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తుండగా, మాణిక్యం (పోసాని) పరిచయమవుతాడు. చందుకి కావాల్సినంత డబ్బు సంపాదించడానికి ఓ అవకాశం వుందని మాణిక్యం చెబుతాడు. చందు సరేనంటాడు. అంతే, ఇక అక్కడి నుంచి చందుకి ఒకదాని వెంట ఇంకోటి సమస్యలే ఎదురవుతుంటాయి. చందుకి అంత డబ్బు ఎందుకు అవసరమవుతుంది? ఆ డబ్బు సంపాదించే క్రమంలో అతనికి ఎదురయ్యే కష్టాలేంటి? వాటిని చందు ఎలా అధిగమించాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
నటనటుల ప్రతిభ
నటుడిగా ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్న నాగచైతన్యకు ఈ సినిమాలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కూడిన పాత్ర దొరికింది. ఛాలెంజింగ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, కాస్త డిఫరెంట్‌గా కన్పించాల్సి రావడంతో దానికి తగ్గ హావభావాలతో ఆకట్టుకుంటాడు నాగచైతన్య. ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ అందంగా ఉంది, అందంతోపాటు అవసరమైతే నటిగానూ సత్తా చాటుకోగలనని నిరూపించుకుంది. స్టయిలిష్ లుక్‌తో తెలుగు తెరపై డీసెంట్ బ్యూటీగా స్థిరపడిపోగల సత్తా తనకుందని చాటి చెప్పింది కృతి సనన్.
పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో కన్పించి, తన మార్క్ డైలాగ్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చేశాడు. బ్రహ్మానందం కనిపిస్తే నవ్వకుండా ఉండగలమా? నవ్వులే నవ్వులు అనేంతగా బ్రహ్మీ పాత్ర వుంది. నవ్వుల రారాజు బాగానే నవ్వించాడు. రవిబాబు, రావు రమేష్ షరామామూలే. వివా హర్ష, సత్య, ప్రవీణ్, సప్తగిరి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇంకాస్త పెప్ యాడ్ చేశారు. మధురిమ ఓ సాంగ్‌లో గ్లామర్‌తో తళుక్కున మెరిసింది. మిగిలిన నటీనటులంతా అవసరమైన మేర సినిమాకి తమ నటనతో ప్లస్ అయ్యారు.
సాంకేతిక వర్గం పనితీరు
‘స్వామిరారా’ సినిమాని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసిన దర్శకుడు సుధీర్ వర్మ, అదే జోనర్‌లో ఈ సినిమానీ తెరకెక్కించాడు. క్రైమ్ స్టోరీకి కామెడీ కిక్ ఇచ్చి, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యాలన్న అతని ప్రయత్నం అభినందించదగ్గది. నీట్‌గా, రిచ్‌గా సినిమా ఉంందంటే అది డైరెక్టర్ విజన్‌గా చెప్పాలి. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి, స్క్రిప్ట్ కూడా బావుంది. స్క్రీన్‌ప్లే ఇంకా బెటర్‌గా రాసుకుని ఉంటే ఇంకా బెటర్ ఔట్‌పుట్ వచ్చేదేమో. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్‌గా చెప్పాలి. సినిమా మూడ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే. పాటలు చూడ్డానికీ, వినడానికీ బాగున్నాయి. ఇలాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ మెయిన్ ఎలిమెంట్. ఈ సినిమాకీ అది బాగా కుదిరింది. ఎడిటింగ్ పరంగా ఓకే. ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ బాగా కుదిరాయి. స్టైలిష్ మూవీ కావడంతో కాస్ట్యూమ్స్ కూడా అలానే డిజైన్ చేయడం బాగుంది.
విశ్లేషణ
మరీ కొత్త కథ ఏమీ కాదుగానీ, దర్శకుడు చెప్పిన విధానం, చూపించిన తీరు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో కొంచెం డల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ మిగతా సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఆడియన్స్‌లో ఇంటర్వెల్ సమయానికి క్రియేట్ అయ్యే క్యూరియాసిటీకి తగ్గట్టుగానే, సెకెండాఫ్‌ని వేగంగా నడిపించాడు దర్శకుడు. ఇక్కడే అన్నీ సమపాళ్ళలో కలిశాయి. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, రొమాన్స్ అన్నీ పెర్‌ఫెక్ట్‌గా మిక్స్ అవడంతో సెకెండాఫ్ వేగంగా నడిచిపోతుంది. అస్సలెక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది సెకెండాఫ్. సినిమాపై రిలీజ్‌కి ముందే ఉన్న అంచనాలతో ఓపెనింగ్స్ బాగున్నాయి. మౌత్ టాక్‌తో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది. పబ్లిసిటీ బాగా చేస్తే, నిర్మాతకి డబ్బులు బాగానే మిగల్చగలదీ సినిమా.
ఫైనల్ కామెంట్
ఎంటర్‌టైనింగ్‌గా దోచేశాడు
మాగల్ఫ్.కాం రేటింగ్: 3.25/5
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







