సౌందర్య చిట్కా:నారింజతో నిగారింపు
- April 24, 2015
సౌందర్య పోషణ కోసం కెమికల్స్‌తో కూడిన క్రీమ్‌లు ఉపయోగించడం కన్నా, సహజసిద్ధంగా లభించేవాటి నుంచి క్రీమ్‌లను తయారుచేసుకోవడం మంచిది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. మంచి నిగారింపు కోసం మనం ఇష్టంగా తినే ‘నారింజ’ ఎలా ఉపయోగపడ్తుందో ఒక్కసారి చూద్దాం. నారింజలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటంలోనూ, మెదడుని చురుగ్గా ఉంచడంలోనూ తోడ్పతాయి. అంతే కాకుండా నారింజ సౌందర్య పరిరక్షణకూ ఉపకరిస్తుంది. కొద్దిగా నారింజ రసం తీసుకుని, దానికి కొంచెం శనగపిండి కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అలా తయారైన పేస్ట్‌ని మొహానికి పూతలా వేసుకుని, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొహం శుభ్రపడి, సున్నితంగా, సుకుమారంగా మారుతుంది. మంచి నిగారింపు కూడా అభిస్తుంది. అలాగే రెండు స్పూన్స్ చొప్పున నారింజ రసం, నిమ్మరసం తీసుకుని, అందులో ఓ స్పూన్ తెనె కలిపి, ముఖానికి రాసి, కాస్త ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ మొటిమలు రాకుండా కాపాడుతుంది. ప్రకృతిలోనే ఇన్ని సహజసిద్ధమైన సౌందర్య పోషకాలున్నప్పుడు, కెమికల్స్‌తో తయారయ్యే ప్యాక్స్ జోలికి ఎందుకువ వెళ్ళడం.?
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







