కన్నీటి దహనము

- October 04, 2015 , by Maagulf

మకుటం లేని మహా రాణి గా చేసి, మురిసాం

నువ్వు పుట్టినప్పుడు మా ఇంటి మహా లక్ష్మివని తలచి  మురిపాల తల్లివై నువ్వు ముద్దు ముద్దుగా అడుగులేస్తుంటే,
ఒకరి మొఖాలు ఒకరం చూసుకొని ముసి ముసిగా నవ్వాం 
పురుషాధిక్య సమాజానికి ధీటుగా చదువుల తల్లిగా మార్చాం 
మొగ్గ దశలో చిగురిస్తున్న నిన్ను చూసుకొని ఆనందంతో 
కళ్ళల్లో వత్తులేసుకొని ఊర్లు పట్టణాల చుట్టూర తిరిగాం
'వరుడు' అనే వరం ఎక్కడో అని ఆశగా ఆత్రంగా గాలించాం..
మదినిండా నీ యోగ క్షేమాల..కోసం దిగులుతో,,
కడకు కానివాల్లను అయిన వాళ్ళగా మార్చుకొని
కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నాం ,,
కట్నం వారి ఆకలి,అడిగినంతా కడుపు నింపి,,
సంతృప్తి పరచినామని భ్రమ పడ్డాం..
మునుముందు వాళ్ళంతా నీ చుట్టూ అల్లుకునే మెట్టింటి
పొదరిల్లే కదా అని మనసును సమాధాన పరచుకున్నాం 
అది పొదరిల్లు కాదు కాగితం నోట్లను లోహపు బిళ్ళలను
మాత్రమే మింగి మనసును గాయ పరిచే, రాకాసి ముళ్ళని 
నీ శరీరాన్ని కట్టి, కాల్చి వేసిన కసాయి గుండెలని" 
మేము చేసింది "కన్యాదానము" కాదు నీ కన్నీటి దహనమని,
ఆలస్యంగా అంతా అయి పోయాక తెలుసుకున్నాం,
మొహాలను చాటేసుకొని చాటుగా నిస్సహాయంగా రోదిస్తున్నాం
ఎందుకంటే నీలాంటి అభాగ్యురాల్ని కని లోకం పోకడ తెలియక 
నిన్ను పోగుట్టుకున్న దురదృష్టవంతులం మేమే కాబట్టి ..  
ఇక ఈ లోకం నిన్ను పరాయి కాదు,పసి పాపల కని పాలిచ్చి 
పెంచి  పోషించే వంశ వ్రుక్షానివని గుర్తించి పూజించే వరకు..
మాలాంటి కన్నీటి గాదలెన్నో ఆగవు 
లోకమంతా కన్నీటి మయం కాక మానదు ..


--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com