చేపలు మామిడికాయ కూర
- April 29, 2017
కావాల్సిన పదార్థాలు
సొరచేప (చర్మంతో) - అరకేజి, పచ్చిమామిడి ముక్కలు (తొక్కతో పాటు) - ముప్పావు కప్పు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, ఉల్లిపాయ తరుగు - పావు కప్పు, కరివేపాకు - 8 రెబ్బలు, దనియాలపొడి - అర టీ స్పూను, మిరియాలపొడి - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, నీరు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ విధానం
చేపని అంగుళం ‘క్యూబ్’లుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, ఉల్లితరుగు, 4 రెబ్బల కరివేపాకు, ధనియాలపొడి, మిరియాలపొడి, పసుపును అరకప్పు నీటితో పేస్టులా గ్రైండు చేసుకోవాలి. కడాయిలో పేస్టుని వేసి మిగిలిన అరకప్పు నీరు, చేపముక్కలు వేసి ఉడికించాలి. చేప సగం ఉడికిన తర్వాత మామిడి ముక్కలు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. నూనెలేకుండా చేసుకునే ఈ చేపలకూర వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







