వలసదారుల కమ్యూనిటీకి ఓ మంచి వ్యక్తిని కోల్పోయింది
- April 29, 2017అనుకోని సమస్యల్లో ఇరుక్కున్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే అజీజ్ అనే మానవతావాది హఠాన్మరణం అందరినీ కలచివేసింది. టికె అజీజ్, 30 ఏళ్ళ క్రితం ఖతార్‌కి వచ్చి, ఇక్కడే నివసిస్తున్నారు. కేరళలోని కోజికోడ్‌కి చెందిన వ్యక్తి ఈయన. ఖతార్‌లో చనిపోయినవారిని స్వదేశాలకు పంపే గురుతర బాధ్యతను అజీజ్ తన భుజాన వేసుకునేవారు. ఆర్థిక సహాయం అందించడం, అలాగే ఇతరత్రా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఖతార్‌లోని కేరళ కమ్యూనిటీకి అజీజ్ అత్యంత ఆప్తుడిగా మారారు. ఆయనమరణం తమను కలచివేసిందని ఐబిసిఎఫ్ ప్రెసిడెంట్ పి.ఎన్. బాబురాజన్ చెప్పారు. అజీజ్ మృతి పట్ల ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తూ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ ఖతార్, వచ్చేన నెలలో ఆయన గౌరవార్థం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అజీజ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







