అమెరికా వైమానిక దాడిలో భారత్ కు చెందిన కేరళ యువకుని మృతి
- April 30, 2017
ఆప్ఘనిస్థాన్‌పై కొన్నివారాల క్రితం అమెరికా చేసిన వైమానిక దాడుల్లో కేరళకు చెందిన యాహ్య అనే ఐఎస్ ఉగ్రవాది మృతిచెందాడు. అతని కుటుంబసభ్యులకు శనివారం రాత్రి టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చిందని సామాజిక కార్యకర్త రెహమాన్ పేర్కొన్నారు. అష్పక్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అయితే అందులో యాహ్య ఎప్పుడు చనిపోయాడో వెల్లడించలేదని తెలిపారు. ఈ సమాచారాన్ని పాలక్కడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ధ్రువీకరించలేదు. ముస్లిం మతంలోకి మారిన యాహ్యతోపాటు మరో 21 మంది ఆచూకీ గతేడాది నుంచి లభించలేదు. వీరు ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు అనుమానించారు. కేరళలోని పడ్నా జిల్లాకు చెందిన ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మృతిచెందాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







