కొలంబియాలో కూలిన విమానం.. 8 మంది మృతి
- May 01, 2017
కొలంబియాలో ఓ సైనిక విమానం ప్రమాదానికి గురైంది. మిలిటరీ బేస్ నుంచి బొగోటాకు బయలుదేరిన సెస్నా కరవాన్ అనే సింగిల్ ఇంజిన్ విమానం సెంట్రల్ కొలంబియాలో కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఓ సీనియర్ మిలిటరీ అధికారి ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి ప్రతికూల వాతవరణ పరిస్థితులే కారణంగా భావిస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. కొలంబియా అధ్యక్షుడు మాన్యుయల్ సాంటోస్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







