గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
- May 03, 2017
ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు.
అలాగే, ఏడో వేతన సంఘం సిఫార్సుల్లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. జాతీయ ఉక్కు విధానానికి కూడా ఆమోదం తెలిపింది.
ప్రధాని మోడీ ట్వీట్
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో ఏపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఈ అంతర్జాతీయ హోదా ఉపకరిస్తుందని అభిలాషించారు.
మూడేళ్లలోనే..
గన్నవరం విమానాశ్రయం కేవలం మూడేళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించింది. అతి తక్కువ సమయంలో అంతర్జాతీయ హోదా దక్కింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







