అబుధాబిలో 2017 'సైమా' అవార్డులు
- May 03, 2017
అబుధాబి టూరిజం మరియు కల్చర్ అథారిటీ, సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సంయుక్తంగా అబుదాబీలో జూన్ 30, జులై 1 తేదీల్లో భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల ఈవెంట్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నటులు రాణా దగ్గుబాటి, జయమ్ రవి, హీరోయిన్ శ్రియ, తమిళ దర్శకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు. అబుధాబి కన్వెన్షన్ బ్యూరో తరఫున ముబారక్ అల్ షమిసి మాట్లాడుతూ, అబుధాబిలో సైమా అవార్డుల ఈవెంట్ జరగడం చాలా గర్వకారణమని అన్నారు. సుమారు 600 మందికి పైగా ఇండియన్ మూవీ స్టార్స్, టెక్నీషియన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. ఈ వేదికపై పలువురు స్టార్స్ చేసే పెర్ఫామెన్స్‌లు ఆహూతుల్ని అలరించనున్నాయి. సైమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ, యూఏఈలో తమకు మంచి ఆతిథ్యం లభిస్తుందని ఆశిస్తున్నామనీ, సౌత్ ఇండియా మొత్తం ఈ అవార్డులపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోందని అన్నారు. సౌతిండియన్ ఫిలింస్, గ్లోబల్ రేంజ్‌కి ఎదగడంలో సైమా పాత్ర చాలా గొప్పదని తమిళ హీరో జయం రవి చెప్పారు.సైమా అవార్డుల ఈవెంట్‌లో పెర్ఫామ్ చేసే అవకాశం రావడం తన అదృష్టమని శ్రియ శరన్ చెప్పింది.సౌత్ ఇండియన్ సినిమా, బెంచ్ మార్క్‌ని సెట్ చేసే స్థాయికి ఎదిగిందని 'బాహుబలి'లో భళ్ళాలదేవుడు రాణా చెప్పారు.ఈ ఈవెంట్ కి RK మీడియా సంస్థ అధినేత రవి కుమార్ పనస PRO గా వ్యవహరిస్తున్నారు.
--ప్రదీప్ చెవ్వా(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)









తాజా వార్తలు
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







