పక్క దేశాల నుంచి వస్తున్న జనం బాహుబలి 2 చూడటానికి
- May 04, 2017
దేశ వ్యాప్తంగానే కాదు బాహుబలి మానియా.... విదేశాల్లో సైతం ఉంది.. కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న విదేశీయులనుంచి రాజమౌళికి బాహుబలి పార్ట్ 1 రిలీజ్ సమయంలోనే ఎదురైంది అంటే ఎంతగా సినిమా అందరినీ ఆకర్షించ్చిందో తెలుస్తుంది.. కాగా బాహుబలి ది కంక్లూజన్ లో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది... దీంతో బాహుబలి 2 ని చూడడానికి ఎంతదూరం అయినా ప్రయాణం చేస్తాం అంటున్నారు.. అవును మనకు పొరుగుదేశం అయిన బంగ్లాదేశ్ సినీ ప్రేక్షకులు బాహుబలి సినిమాపై అభిమానంతో ఏకంగా దేశం దాటి వస్తున్నారు.. ఏమిటి చదువుకోవడానికో.. లేదా వైద్య సాయం కోసమో దేశం దాటి వచ్చారు అంటే.. ఒకే కానీ ఒక్క సినిమాకోసం దేశం దాటి అంతా ఖర్చుపెట్టుకొని వచ్చి సినిమా చూస్తున్నారా..! ఇది నమ్మశఖ్యంగా గా లేదు అని అనుకున్నా ఇది నిజంగా నిజం... 'బాహుబలి: ది కంక్లూజన్' చూడటం కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కోల్‌కతాకు జనాలు తరలి వస్తున్నారు. ఈ విషయంపై ఇండియాటుడే ఓ ప్రత్యేక కధనాన్ని ప్రచురించింది..
బాహుబలి 2 చూడటం కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 40 మంది బంగ్లాదేశీయులు.. కోల్‌కతాకు వచ్చారట. కేవలం బాహుబలి-2 చూడటానికే వీరంతా వచ్చారని... అందులో కుర్రాళ్లతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. హసన్ ఖాన్ అనే బిజినెస్ మ్యాన్ తన కుటుంబాన్ని తీసుకుని 'బాహుబలి-2' చూడటానికి కోల్ కత్తా వచ్చాడట... దక్షిణ కోల్‌కతాలోని ఓ మల్టీప్లెక్స్ యాజమాన్యంతో ముందే మాట్లాడుకుని టికెట్లు కన్ఫమ్ చేసుకున్నాక వీళ్లంతా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని కోల్‌కతాకు వచ్చారు. కాగా తమకు దక్షిణ ఇండియా సినిమాలపై పెద్దగా అవగాహన లేదని.. కానీ 'బాహుబలి: ది బిగినింగ్' హిందీ వెర్షన్ చూసి మతిపోయిందని.. అప్పట్నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూశామని బంగ్లా అభిమానులు అంటున్నారు. తమ దేశంలోనూ లక్షలాది మంది 'బాహుబలి-1' హిందీ వెర్షన్‌ను ఆన్ లైన్లో చూసి పిచ్చెక్కిపోయారని అందరూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని తెగ ఆలోచించే వారని తెలిపారు. ఐతే ఇలా ఓ సినిమా చూడటం కోసం దేశం దాటి రావడం అనే సంఘటన చరిత్రలో నిలిచిపోయేదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







