హీరో సందీప్ కిషన్ 'ప్రాజెక్ట్ z' మే లో విడుదల
- May 05, 2017
సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రాన్ని 'ప్రాజెక్ట్ z' గా ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్లో ఎస్.కె. బషీద్ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎస్.కె.బషీద్ మాట్లాడుతూ..ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ 'మాయావన్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'ప్రాజెక్ట్ z' గా మా ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్లో అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్‌కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. అతి త్వరలో ఆడియోని రిలీజ్ చేసి, ఈ నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, డిఓపి: గోపి అమర్నాథ్, ఎడిటర్: లియో జాన్ పాల్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, ఆర్ట్: గోపి ఆనంద్, సమర్పణ: ఎస్.కె. బషీద్, నిర్మాత: ఎస్.కె. కరీమున్నీసా, స్టోరీ-దర్శకత్వం: సి.వి. కుమార్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







