టివి లో క్రైమ్ సీరియల్స్ చూసి చంపేశాడు !!
- May 06, 2017
మీ పిల్లలు క్రైమ్ సీరియళ్లు చూస్తున్నారా..? ఎందుకైనా మంచిది కొంచెం ఓ కన్నేయండి.! లేదంటే క్రిమినల్ గా జైళ్లో చూడాల్సిన పరిస్థితి రావొచ్చు. ఓ డిగ్రీ కుర్రాడు..క్రైమ్ సీరియళ్లు చూసి చూసి..క్రిమినల్ గా మారాడు. డబ్బుల కోసం పక్కింటి అబ్బాయిని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మునీర్.. చదివేది బీకాం ఫస్టియర్ కానీ.. బుర్రనిండా అన్నీ క్రైమ్ ఆలోచనలు. స్మార్ట్ ఫోన్లో నిత్యం క్రైమ్ సీరియళ్లు చూసీ చూసి..క్రిమినల్ గా మారాలని కలలు కన్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పులు కూడా చేశాడు. అప్పులు తీర్చేందుకు ఏదో ఒక నేరం చేయాలని డిసైడయ్యాడు. కానీ ఎవర్ని కిడ్నాప్ చేయాలి..? ఇలా రెండుమూడ్రోజులు ఆలోచించాడు.
హైద్రాబాద్ బండ్లగూడలోని జహంగీరాబాద్లో ఉంటున్న మునీర్..తమ ఇంటి పక్కనే ఉండే పిల్లాడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని స్కెచ్ వేశాడు. పన్నెండేళ్ల ఉరూజుద్దీన్ అహ్మద్..రోజూ సాయంత్రం అరబిక్ నేర్చుకునేందుకు వెళ్తున్నాడని గమనించాడు. ఏప్రిల్ 28న బైకుపై సరదాగా తిప్పుతానని నమ్మించి జహంగీరాబాద్లోని కుంట వద్దకు తీసుకెళ్లాడు. కిడ్నాపైతే చేశాడు కానీ..బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్
చేసేందుకు ధైర్యం సరిపోలేదు. భయమేసి చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నాడు. కానీ..ఈ విషయం బయటకు తెలిసినా..కుర్రాడు ఇంటికెళ్లినా.. పోలీసులకు తెలుస్తుందని.. పరువు పోతుందని గొంతు నులిమి చంపేశాడు. ఆతర్వాత బట్టులు తీసి తగులబెట్టాడు. శవాన్ని చెరువులో పడేశాడు. పన్నెండేళ్ల అహ్మద్ ను హత్యచేసిన మునీరుద్దీన్ అదేరోజు ఏప్రిల్ 28న ముంబై వెళ్లాడు. ఐదురోజులు అక్కడే తిరిగి ఏమితెలియనట్టు బుధవారం సీటికొచ్చాడు. తాను మర్డర్ చేసినట్టు ఆధారాలు లేవని ధైర్యంతో హైద్రాబాద్ వచ్చాడు. బట్..అప్పటికే పోలీసులు సీసీ ఫూటేజ్ వివరాలు సేకరించారు. మునీర్ కూడా అజ్ఞాతంలో ఉండటంతో నేరం చేసింది అతనేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుడు మునీర్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం ఒప్పుకున్నాడు. అహ్మద్ ను కిడ్నాప్ చేసి..డబ్బులు డిమాండ్ చేసే ధైర్యలేక హతమార్చినట్టు అంగీకరించాడు. బుద్ధిగా చదువుకోకుండా క్రైమ్ సీయళ్లకు ఎడిక్ట్ అయినా మునీర్..చివరకు నేరస్తుడిగా మారిపోయాడు. వ్యవసాలకు అలవాటు పడి పాపం ముక్కుపచ్చలారని బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. చివరకు కటకటాలపాలై భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









