గ్యాస్ లీక్.. 150 మంది విద్యార్థులకు అస్వస్థత
- May 06, 2017
దక్షిణ ఢిల్లీలో తెల్లవారుజామునే పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. తుగ్లకాబాద్‌కు సమీపంలోని పుల్ పెహ్లాద్పూర్ ప్రాంతంలో ఉన్న రాణీ ఝాన్సీ స్కూలు సమీపంలో ఓ కంటెయినర్ నుంచి గ్యాస్ లీకైంది. దాంతో వంద మంది విద్యార్థులను స్కూలు నుంచి వెంటనే బయటకు తీసుకొచ్చేశారు. వారిలో 150 మంది అస్వస్థత పాలు కావడంతో వారిని వెంటనే సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకున్నారు.
గ్యాస్ లీకేజికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం.. సమయానికి అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకొచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ పైపులైన్ల నుంచి గ్యాస్ లీకైనప్పుడు టీ పెట్టేందుకు స్టవ్ వెలిగించాలని అగ్గిపుల్ల గీస్తే.. ఆ మంటలు ఊరంతా వ్యాపించిన గ్యాస్‌కు అంటుకుని భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









