9 నెలల కూతురిని కొరికి కొరికి చంపిన తండ్రి
- May 06, 2017
డమాస్కస్ ( సిరియా ) : పాము తన పిల్లలను తానె చంపి తిన్న రీతిలో...ఆడపిల్ల పుట్టిందని ఓ నరరూప రాక్షసుడు తన వికృతచేష్టలను ప్రదర్శించాడు. నెలల పసిగుడ్డును తన పంటి గాట్లతో దారుణంగా కొరికి హతమార్చాడు. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో సిరియా దేశస్థుడైన ఆ దుర్మార్గుడు తన ఇంట ఆడపిల్ల ఉండటం ఎంతో అవమానకరమని భావించెనని అందుకే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని ఎదురు దబాయిస్తున్నాడు. పురుషాధిక్యత తలకెక్కి..తనకూ ఓ మహిళే జన్మ నిచ్చిందనే విషయాన్నేవిస్మరించిన ఆ 37 ఏళ్ల సిరియన్ దుర్మార్గపు తండ్రి తన తొమ్మిది నెలల కుమార్తె దలాల్ పట్ల దయలేని విధంగా ప్రవర్తించించి పసి ప్రాణాలను తీసేశాడు . ఈ సంఘటన ఏప్రిల్ 24 వ తేదీన సిరియా దేశంలోని డమాస్కస్ సమీపంలోని జరమనా ప్రాంతంలో జరిగింది.స్థానిక దిన పత్రిక ' అల్ అరేబియా ' కధనం ప్రకారం, ఆ రాక్షస తండ్రికి ఆడపిల్లలంటే ఎంతో అసహ్యమని వారు తమ కుటుంబంలో ఉండటం ఎంతో అవమానకరంగా భావించేడని పేర్కొంది. ఓ దురదృష్టపు రోజున తన తొమ్మిది నెలల కుమార్తె, దలాల్ తన భర్త చేతుల్లో మరణించే ప్రమాదం ఉందని ముందే ఆ తల్లి గ్రహించింది. అయితే, తన భర్తను నిలవరించలేని ఆ నిస్సహాయ తల్లి సహాయం కోసం పొరుగు ఇంటికి వెళ్లి తన బిడ్డను కాపాడమని ప్రాధేయపడింది. కానీ, అప్పటికే ఆలస్యమయింది...ఆ దుర్మార్గుడు పసికూన మృదువైన దేహంపై తన పదునైన కోరల్లాంటి పండ్లతో పలుచోట్ల బలంగా కొరికి రక్తమోడుతున్న ఆ చిన్నారిని అక్కడ వదిలిపెట్టాడు. విగతజీవిగా పడి ఉన్న తన బిడ్డను చూసిన ఆ తల్లి తన భర్త చేసిన ఘాతుకానికి నివ్వెరపోయింది. కన్నబిడ్డపై మమకారం పోగొట్టుకోలేని ఆ తల్లి ఆ పసిపిల్లను తీసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లింది కానీ, క్రూర మృగమైన ఏదైనా పరిస్థితులలో కనికరంపడి తన వేటను వదులుతుందేమోగాని ...నిలువెల్లా విషం నింపుకున్న తండ్రి రూపంలో ఉన్న ఆ రక్తపిశాచి క్రూరమైన కాట్లకు ఎపుడో ఆ చిన్నారి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం సంబంధిత అధికారులచే దర్యాప్తు చేయబడుతోంది.ఈ సంఘటన సిరియన్ ప్రజలచే విస్తృతంగా విమర్శించబడింది, "బుల్లెట్ల చేత చనిపోలేని వారు పిచ్చివాళ్ళ చేతిలో చనిపోతారని !" పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కథ సాంఘిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారమయ్యింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







