కటారా మార్కెట్ యాంటిక్స్‌పై జిసిసి విజిటర్స్ ఆసక్తి
- May 06, 2017
కటారా మార్కెట్, దోహాకి చెందినవారినే కాకుండా జిసిసి దేశాల నుంచి కూడా పలువుర్ని ఆకర్షిస్తోంది. కటారా బీచ్ ఏరియాలో ఏర్పాటు చేసిన కల్చరల్ విలేజ్‌లో, హ్యాండ్ మేడ్ క్లాతింగ్, సిరామిక్స్, యాంటిక్స్ కలెక్షన్, యూజ్డ్ బుక్స్, హ్యాండిక్ఫ్రాన్ట్స, పెయింటింగ్స్, ఇస్లామిక్ ఆర్ట్ వర్క్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కటారా మార్కెట్లో ఓ షాప్ నిర్వహిస్తున్న సిరియన్ డిజైనర్ మొహమ్మద్ హతీమ్ మాట్లాడుతూ, తన రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా సౌదీ అరేబియా నుంచి ఉంటారనీ, వారికి కావాల్సినవి తన దగ్గర కొంటుంటారని చెప్పారు. వారాంతాల్లో ఎక్కువగా సౌదీ షాపర్స్ వస్తుంటారనీ, వింటర్ కాలంలో వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని వివరించాడాయన. హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్‌ని జిసిసి జాతీయులు ముఖ్యంగా ఖతారీలు ఎక్కువగా ఇష్టపడతారని ఆయన చెప్పారు. టర్కీకి చెందిన మహమౌద్ కింగ్ మాట్లాడుతూ, మార్కెట్‌కి వచ్చేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోందని అన్నారు. పెయింటింగ్స్‌తోపాటు జ్యుయెలరీ, బ్యూటీ డిజైన్డ్ జార్స్, సిరామిక్స్, సావనీర్, గ్లాస్ బాటిల్స్ ఇలా పలు ఆకర్షిణీయమైన వస్తువుల్ని విక్రయిస్తుంటారాయన. రేడియో సెట్స్, పోలరాయిడ్ కెమెరాస్, గ్రామ్‌ఫోన్ రికార్డ్ ప్లేయర్, యాంటిక్ ఫోన్ సెట్స్, హోమ్ డెకార్స్ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. పాత వస్తువులు పనిచేయవని కొందరు అనుకుంటారనీ, కానీ పనికొచ్చే వస్తువులే తాము విక్రయిస్తామని మరికొందరు షాప్ యజమానులు చెప్పారు. ఫుడ్ ఐటమ్స్ కూడా కటారా మార్కెట్లో ప్రధాన ఆకర్షణ.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







