దొంగతనం కేసు నుంచి నర్స్‌కి ఊరట

- May 06, 2017 , by Maagulf
దొంగతనం కేసు నుంచి నర్స్‌కి ఊరట

యు.ఏ.ఈ:26 ఏళ్ళ సుడానీస్‌ నర్స్‌, దొంగతనం కేసు నుంచి ఉపశమనం పొందింది. 81 ఏళ్ళ ఎమిరేటీ స్పాన్సరర్‌ దగ్గర ఆమె పనికి కుదిరింది. ట్రీట్‌మెంట్‌ నిమిత్తం ఆమెను, యజమాని దగ్గర ఉంచారు. తొలుత ఆమె ఈ పనికి అంగీకరించనప్పటికీ, తర్వాత ఒప్పుకుందని 81 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి తనయుడు 33 ఏళ్ళ సైనికుడు చెప్పారు. 2016 జూన్‌లో ఆమెను పనికి కుదిర్చినట్లు విచారణలో న్యాయస్థానానికి తెలిపారు వృద్ధుడి తనయుడు. ట్రీట్‌మెంట్‌ నిమిత్తం తన తండ్రి విదేశాలకు వెళుతుండగా, నర్స్‌ని తాత్కాలికంగా సెలవు తీసుకోమని కోరినట్లు వెల్లడించిన తనయుడు, ఆ సమయంలో ఆమె బ్యాగ్‌లో తమకు కొన్ని వస్తువులు దొరికాయని, ఆ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే న్యాయస్థానంలో 81 ఏళ్ళ వృద్ధుడు, తన కోసం పనిచేసిన నర్స్‌ తన వద్దనుంచి ఏమీ దొంగిలించిందని తాను విశ్వసించడంలేదని చెప్పడంతో ఈ కేసులో నర్సుకి ఊరట లభించింది. తన వద్ద ఉన్నన్నాళ్ళూ వినియోగించుకోవాల్సిందిగా వాచ్‌నీ, ల్యాప్‌టాప్‌నీ తానే ఇచ్చినట్లు చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com