గార్డియన్‌షిప్ నిబంధనల సడలింపు
- May 06, 2017
రియాద్: కింగ్‌డమ్‌లో కొత్తగా మేల్ గార్డియన్ షిప్ నిబంధనలను సడలించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్‌డమ్‌లో మహిళలకు మరింత స్వేచ్ఛ లభించే దిశగా ఈ సడలింపు ఉందని పేర్కొంటున్నారు. కింగ్ సల్మాన్ విడుదల చేసిన తాజా ఆర్డర్ ద్వారా, పలు ప్రభుత్వ సర్వీసులను (ఎడ్యుకేషన్ మరియు హెల్త్ కేర్ వంటి రంగాలు) మేల్ గార్డియన్‌తో సంబంధం లేకుండా మహిళలు పొందే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చదువు, ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందడం, పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లలో పని చేయడం, కోర్టుల్లో తమను తాము రిప్రెజెంట్ చేసుకోవడం వంటివి మేల్ గార్డియన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతాయి ఇకపై. 2011 నుంచి కింగ్ అబ్దుల్లా పలు నిర్ణయాలు ఈ దిశగా తీసుకుంటున్నారు. మహిళలు ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల్లో ఓటేయగలుగుతున్నారు. రిటైల్ మరియు హాస్పిటాలిటీ జాబ్స్‌లో పనిచేస్తున్నారు. 2012లో తొలిసారిగా మహిళలు పోటీ చేశారు కూడా. మేల్ గార్డియన్‌షిప్ సిస్టమ్ ప్రకారం చూస్తే మహిళలు, భర్త లేదా తండ్రి లేదా కొడుకు ద్వారా అనుమతి పొంది మాత్రమే చదువుకోవడం, పెళ్ళి చేసుకోవడం వంటివి చేయాలి.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









