ఆగస్ట్ 11న 'ఓటర్' రిలీజ్
- May 06, 2017
మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. "మా మోహన్ బాబు గారి జన్మదినం సందర్భంగా "శ్రీవిద్యానికేతన్ 25వ వార్షికోత్సవ వేడుక రోజున ప్రఖ్యాత సంగీత దర్శకులు ఇళయరాజా మా సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయడం మాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న "ఓటర్" చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. "ఓటర్" చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి.. ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.
సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







