సూపర్ స్టార్ రజనీతో కాంగ్రెస్ లీడర్, ప్రముఖ హీరోయిన్ నగ్మా భేటీ
- May 07, 2017
తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అలనాటి హీరోయిన్, కాంగ్రెస్ నేత నగ్మా కలిశారు. చెన్నైలోని రజనీ నివాసంలో ఆమె ఆయన్ను కలిశారు. అయితే.. రజనీతో నగ్మా సమావేశానికి గల కారణాలు తెలియరాలేదు. రజనీకాంత్‌ను కలిసినట్టు నగ్మా తన ట్విట్టర్లో వెల్లడించారు. ఆయనతో సమావేశం చాలా ఆనందాన్నిచ్చిందని, పలు అంశాలపై రజనీతో చర్చించానని ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. అయితే.. రజనీతో ఆమె ఏ విషయాలు చర్చించారన్నది మాత్రం వెల్లడించలేదు. మామూలుగానే రజనీని కలిశారా..? లేదా ఆ సమావేశానికి ఏదైనా రాజకీయ ప్రాధాన్యం ఉందా..? అని కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం నగ్మా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రజనీతో కలిసి భాషా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







