వరల్డ్ డే ఫర్ సేఫ్టీ మరియు హెల్త్ ఎట్ వర్క్
- May 08, 2017
మస్కట్ మరియు సోహార్‌లో ఆర్పిక్ సంస్థ, వరల్డ్ డే ఫర్ సేఫ్టీ మరియు హెల్త్ ఎట్ వర్క్‌ని ఘనంగా నిర్వహించింది. 'డిసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్' థీమ్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆర్పిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అహ్మద్ సలెహ్ అల్ జహ్‌దామి మాట్లాడుతూ, వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ కార్యక్రమం ఆర్పిక్ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టర్లకు మంచి అవకాశమనీ, పనిచేసే ప్రాంతాల్లో భద్రత, అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంపై అవగాహన చాలా ముఖ్యమనీ, అప్పుడే ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో పయనిస్తుందని వివరించారు. ఈ ఏడాది ఆర్పిక్, తమ ఉద్యోగుల కోసం చేపట్టిన కార్యక్రమం ద్వారా పనిచేసే ప్రదేశాల్లో భద్రత, అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఒకరోజు ప్రచార కార్యక్రమంలో హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌పై పలు ఆసక్తికరమైన అంశాల్ని రూపొందించారు. 2003లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ 'వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్'ని ప్రకటించింది. పని చేసే ప్రదేశాల్లో అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఇతరత్రా భద్రతాపరమైన ఇబ్బందులపై కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఒమన్ ఆయిల్ రిఫైనరీస్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ కంపెనీ (ఆర్పిక్), ఒమన్‌లోనే అతి పెద్ద సంస్థ. సోహార్, మస్కట్‌లలో ఈ సంస్థ ప్లాంట్లు ఫ్యూయల్, కెమికల్స్, ప్లాస్టిక్స్‌ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







