ఢిల్లీ - దోహా ఇండిగో విమానానికి హెచ్‌ఐఏ ఘనస్వాగతం
- May 08, 2017
గంగా అభివృద్ధి సాధిస్తున్న ఇండియాకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఇండిగో, దోహాకి తమ సేవల్ని ప్రారంభించింది. ఢిల్లీ - దోహా విమానం 6ఇ1701, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఇండిగోకి సంబంధించినంతవరకు షార్జా, మస్కట్ మరియు దుబాయ్ తర్వాత ఇండిగో నెట్‌వర్క్‌లో నాలుగో మిడిల్ ఈస్టర్న్ డెస్టినేషన్ అలాగే, ఏడవ ఇంటర్నేషనల్ డెస్టినేషన్‌గా దోహా మారింది. హెచ్‌ఐఏ వద్ద జరిగిన ఇనాగ్యురల్ సెర్మనీలో, తొలి విమానానికి ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ - దోహా, ముంబై - దోహా మధ్య అందరికీ అందుబాటులో ఉండే ఛార్జీలతో విమాన సర్వీసుల్ని నడుపుతున్నట్లు ఇండిగో వర్గాలు వెల్లడించాయి. ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఖతార్ ఎకనమిక్ మరియు కల్చరల్ హబ్ కావడంతో దోహా, వ్యాపార వర్గాల్ని విశేషంగా ఆకర్షిస్తోందని చెప్పారు. టూరిజం పరంగానూ దోహా ఎంతో ప్రత్యేకతను చాటుకుందన్నారు. తద్వారా ప్రయాణీకులు దోహా వెళ్ళేందుకు ఎక్కువగా ముందుకొస్తున్నట్లు వివరించారాయన. హెచ్‌ఐఏ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బదర్ మొహమ్మద్ అల్ మీర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల సౌకర్యం తమ తొలి ప్రాధాన్యం అని చెప్పారు. ఇండిగో విమానాల చేరికతో, మొత్తం వారానికి 25 విమానాలు ముంబై నుంచి, అలాగే 35 విమానాలు ఢిల్లీకి పయనమవుతున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







