ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన
- May 08, 2017
తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, తీవ్రగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర వరకూ ద్రోణి ఏర్పడిందని...దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 5 సెం.మీ, విజయనగరంలో 3 సెం.మీ, డెంకాడ, వేపడ, పూసపాటిరేగ, తెర్లాంలో 2 సెం.మీ, విశాఖలో 3 సెం.మీ, అనంతపురం జిల్లా పెనుగొండలో 3 సెం.మీ, లేపాక్షిలో 2 సెం.మీ, కర్నూలు జిల్లా హోళగుందలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







