స్కూల్ మేథమేటిక్స్ కోసం కొత్త పుస్తకం
- May 08, 2017
మనామా: మేథమేటిక్స్ అంటే చాలామందికి భయం ఉంటుంది. అయితే మేథమేటిక్స్ని సరదాగా, ఈజీగా భావించేవారూ ఉంటారు. కష్టంగా మేథమేటిక్స్ని భావించేవారి కోసం, మేథమెటిక్స్ని తేలికగా అర్థమయ్యేలా చేస్తూ డాక్టర్ మసూమా అల్ ముతావా, 'డెవలపింగ్ బహ్రెయిన్ ఫ్యూచర్ స్కూల్స్ మేథమేటిక్స్' అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని లాంబార్ట్ అకడమిక్ పబ్లిషింగ్ సంస్థ జర్మనీలో పబ్లిష్ చేసింది. స్కూల్ మేథమేటిక్స్ కరికులమ్‌ని, బహ్రెయిన్ క్వాలిటీ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా సులభతరం చేస్తుంది ఈ సరికొత్త పుస్తకం. డాక్టర్ అల్ ముతావా, బహ్రెయిన్ టీచర్స్ కాలేజీ - (యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్) అసిస్టెంట్ ప్రొఫెసర్. యూకేలో హెచ్ఇఎ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్‌ని 2014లో పొందారు. ఆమె అంతర్జాతీయ స్థాయిలో పలు సైంటిఫిక్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ అరబిక్ లిటరరీ రీడర్లో ఓ చాప్టర్‌ని 2016లో ఆమె పబ్లిష్ చేశారు. అకడమిక్ యాక్టివిటీస్తోపాటుగా, డాక్టర్ మసూమా స్టోరీ రైటర్‌గానూ పేరుగాంచారు. ఎనిమిది నవల్స్ని ఇప్పటిదాకా ఆమె రచించారు. బహ్రెయిన్‌లో తొలి మహిళా స్క్రిప్ట్ రైటర్‌గా ఆమె పేరొందారు. పలు టీవీ సీరిస్‌లకు ఆమె రచన చేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







