ఓలాతో చేతులు కలిపిన భారతి ఎయిర్టెల్
- May 08, 2017
కస్టమర్లకు పలు రకాల డిజిటల్ సర్వీసులు అందించే నిమిత్తం క్యాబ్ అగ్రిగేటర్ ఓలాతో భారతి ఎయిర్టెల్ జట్టుకట్టింది. ఇందులో భాగంగా ఓలా యాప్‌తో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఇంటిగ్రేట్ అవుతుంది. ఫలితంగా వినియోగదారులు తమ ఓలా ప్రయాణాలకు సులభంగా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. అదే విఽధంగా ఓలా మనీ (ఓలా మొబైల్ వాలెట్) మై ఎయిర్టెల్ యాప్, ఎయిర్టెల్ వెబ్‌సైట్‌తో ఇంటిగ్రేట్ అవుతుంది. దీని వల్ల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మొబైల్/డిటిహెచ్ కనెక్షన్లకు రీచార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఓలా రైడ్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారికి ఎయిర్టెల్ రిటైల్ పాయింట్లు సహకారం అందించనున్నాయి. రెండు సంస్థల కలయిన మూలంగా కస్టమర్లకు మరిన్ని సర్వీసులు అందించే అవకాశం ఏర్పడుతుందని భారతి ఎయిర్టెల్ ఎండి, సిఇఒ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









