ఆసుపత్రిలో చిన్నారుల్ని పరామర్శించిన కింగ్ ఖాన్
- May 09, 2017
కింగ్ ఖాన్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్, దుబాయ్‌లోని జలియా చిల్డ్రన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తమ అభిమాన నటుడు అలా తమ వద్దకు రావడంతో చిన్నారుల ఆనందానికి హద్దుల్లేకుండాపోయింది. 'బిమై గెస్ట్ ఫిలిం' పేరుతో దుబాయ్ టూరిజం నిర్వహిస్తోన్న ప్రమోషనల్ క్యాంపెయిన్ కోసం బాలీవుడ్ ప్రముఖులు దుబాయ్ తరలి వచ్చారు. షారుక్‌ఖాన్‌ని కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు దుబాయ్‌లోని షారుక్ అభిమానులు పోటీ పడ్డారు. బి మై గెస్ట్ ఫిలిం సోషల్ మీడియాకి చెందిన వివిధ ప్లాట్‌ఫామ్‌లపై 45 మిలియన్ వ్యూస్‌ని సంపాదించింది ఇప్పటిదాకా. ప్రపంచ వ్యాప్తంగా యూ ట్యూబ్ ట్రెండంగ్‌ని తీసుకుంటే 48 గంటల్లోనే మూడో స్థానంలో నిలిచింది. డిసెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది వీక్షించిన వీడియోల్లో టాప్ 10లో చోటు దక్కించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







