జపాన్‌లో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు
- May 09, 2017
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక పరిశోధనా కేంద్రం కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ భూకంపంతో సముద్రమట్టాల్లో స్వల్ప తేడాలు వస్తాయి కానీ సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నాలుగు టెక్టానిక్ ప్లేట్లలో వచ్చే కదిలికల వల్ల ఏటా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయని అధికారులు తెలిపారు.
2011లో సముద్ర గర్భంలో ఏర్పడిన భారీ ప్రకంపనల కారణంగా ఇక్కడ సునామీ ఏర్పడింది. ఈ విపత్తులో దాదాపు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







