తెలంగాణ భూ సేకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- May 09, 2017తెలంగాణ భూ సేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపింది. రెండు, మూడు రోజుల్లో భూ సేకరణ బిల్లు-2016పై రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
కాగా గతంలో ఈ భూ సేకరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం... పలు సవరణలు చేయాల్సిందిగా రాష్ట్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆ అభ్యంతరాలను సరిచేసిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కేంద్రానికి పంపించింది. దీంతో భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోనే మకాం వేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షి జరిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







