మెక్సికో లో ప్రపంచ భారీకాయుడి ఆపరేషన్ సక్సెస్
- May 10, 2017
ప్రపంచంలోనే భారీ కాయుడైన జువాన్ పెడ్రో ఫ్రాంకో(32)కు మెక్సికో వైద్యులు తొలి సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్‌కు ఫ్రాంకో శరీరం సహకరించడంలో భాగంగా మూడు నెలలుగా పైగా డాక్టర్ల ఇచ్చిన డైట్‌ను తీసుకున్న భారీకాయుడు దాదాపు 175 కిలోల బరువు తగ్గి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలో భాగంగా మంగళవారం ఫ్రాంకోకు తొలి ఆపరేషన్ చేసినట్లు సర్జన్ జోస్ ఆంటోనియో కాస్టానెడా క్రూజ్ తెలిపారు.
సర్జరీ పూర్తయింది కానీ అతడి శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుందో గమనించాల్సి ఉంటుందన్నారు. సగం బరువైనా తగ్గాలని నిర్ణయించుకున్న ఫ్రాంకో ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. గత నవంబర్‌లో అతడికి బేరియాట్రిక్ సర్జరీ చేయడానికి మెక్సికో జార్డెన్స్ దే గ్వాడలుపే డే జపోపాన్ వైద్యులు ముందుకొచ్చారు. ఈ జనవరి నుంచి మార్చి నెల వరకూ స్పెషల్ డైట్ ఇచ్చి 175 కిలోలు తగ్గించారు. మే9న ఆపరేషన్ చేస్తామని ముందస్తుగానే చెప్పినట్లుగా జోస్ ఆంటోనియో కాస్టానెడా సర్జరీ చేశారు.
ఆహారపు అలవాట్ల సమస్యలతో పాటు మానసికంగానూ అతడిని దృఢంగా చేయాలన్నదే తమ ధ్యేయమని లేనిపక్షంలో పరిస్థితుల్లో తేడాలొచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. గత ఆరేళ్లుగా బెడ్డుకే పరిమితమైన ఫ్రాంకో త్వరలో లేచి తిరుగుతాడని ధీమా వ్యక్తంచేశారు. 2007లో 597 కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిభారీ కాయుడిగా రికార్డు సృష్టించిన మాన్యుఎల్ యురైబ్ గతేడాది చనిపోయిన తర్వాత పెడ్రో ఫ్రాంకో(595 కిలోలు)లో అంతర్మథనం మొదలైంది. అప్పటినుంచీ తన బరువు తగ్గడంపైనే దృష్టిసారించినట్లు స్వయంగా అతడే పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ప్రస్తుత సర్జరీ తర్వాత బరువు ఎంతమేరకు తగ్గుతాడో డాక్టర్లు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







