డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
- May 10, 2017
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెని పదవి నుంచి తొలగించారు. ట్రంప్ నిర్ణయంపై డెమాక్రాట్లు మండిపడ్డారు. రష్యాతో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావింతం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే.. క్లింటన్ ఈ-మెయిల్స్ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్‌కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు పదేళ్ల కాల వ్యవధి ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా మాత్రమే పదవిలో ఉన్న కొమెను తొలగించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొమెకు ట్రంప్ లేఖ..!
ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తున్న విషయాన్ని ట్రంప్ నేరుగా కొమెకు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఓ లేఖను కొమెకు పంపించారు. దీనిలో ‘మీరు బ్యూరోను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారనే అమెరికా అటార్నీ జనరల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై అటార్ని జనరల్ సీజన్స్ మాట్లాడుతూ ‘అత్యున్నత శ్రేణి క్రమశిక్షణ, నిబద్ధత, చట్టానికి కట్టుబడి ఉన్నాం. అందుకే ఒక కొత్త ప్రారంభం అవసరమైంది’ అని పేర్కొన్నారు.
మీటింగ్‌లోనే సమాచారం..
లాస్ఏంజిల్స్లోని ఎఫ్‌బీఐ ఏజెంట్లతో సమావేశంలో ఉన్నప్పుడు తనను తొలిగిస్తున్న విషయం కొమెకు తెలిసింది. ఆయన బృందంలోని ఒక సహచరుడు ఆయనకు ఈ విషయాన్ని తెలిపారు. 56 ఏళ్ల కొమె ఈ విషయాన్ని జోక్‌గా భావించి సరదాగా తీసుకున్నారు. తర్వాత అది వాస్తవమని అర్థమైంది. ప్రస్తుతం ఎఫ్‌బీఐ డెరెక్టర్ ఖాళీని భర్తీ చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
ఆ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేపట్టిన దర్యాప్తు ట్రంప్‌కు చుట్టుకుంటుందన్న భయంతోనే కొమెను తొలగించినట్లు సెనెట్ నాయకుడు చుక్ స్కీమర్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ట్రంప్ ఇప్పటికే కొట్టివేశారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







