శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు: నిషిత్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన
- May 10, 2017
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డు ప్రమాదంలో నిషిత్ మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో.. తీవ్ర శోకసముద్రంలో మునిగిన నిషిత్ కుటుంబాన్ని బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని అన్నారు. ఎదిగొచ్చిన కుమారుడు దూరమైపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కొడుకును కోల్పోయిన విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాగా, అంతకుముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు అపోలో ఆసుపత్రికి చేరుకుని.. ఏర్పాట్లను దగ్గరుండి పరామర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వీరితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







