అమెజాన్ డిస్కౌంట్ల పండుగ
- May 10, 2017
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించబోయే నాలుగు రోజుల డిస్కౌంట్ల, క్యాష్ బ్యాక్ పండుగ నేటి అర్థరాత్రి 12 గంటల నుంచే ప్రారంభం కాబోతుంది. గురువారం నుంచి ఆదివారం వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర్నుంచి, హోమ్ అప్లియెన్స్, బుక్స్, ఫ్యాషన్ వేర్ వరకు తన ప్లాట్ ఫామ్ పై దొరికే అన్ని వస్తువులపై డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ లను అమెజాన్ ప్రకటించింది. మొబైల్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్ లపై 40 శాతం నుంచి 80 శాతం వరకు, హోమ్, కిచెన్ అప్లియెన్స్ పై 70 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
త్వరితగతిన డెలివరీ, సులభరతమైన రిటర్న్స్ లను ఈ సేల్ సందర్భంగా అమెజాన్ అందించనుంది. శాంసంగ్, మోటోరోలా, లెనోవో, పుమా, అదిదాస్, ఎల్జీ, బజాజ్ వంటి టాప్ బ్రాండ్లపై బొనాంజ ఆఫర్ల ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. ఆపిల్ కూడా ఈ సేల్ లో భాగంగా తన ఐఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 32జీబీ) ఫోన్ ను రూ.26,999కు, ఆపిల్ ఐఫోన్ 5ఎస్ (స్పేస్ గ్రే, 16జీబీ) ను 17,783 రూపాయలకు, ఆపిల్ ఐఫోన్7 (బ్లాక్, 32జీబీ)ను 47,790 రూపాయలకు, ఐఫోన్ 6ఎస్ (స్పేస్ గ్రే, 32జీబీ)ను 37,141 రూపాయలకు, ఐఫోన్ ఎస్ఈ (రోజ్ గోల్డ్, 64జీబీ)ను 27,624 రూపాయలకు అందుబాటులో ఉంచుతోంది.
అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో కూల్ ప్యాడ్ కూడా పాలుపంచుకుంటోంది. కూల్ ప్యాడ్ తన నోట్ 5, నోట్ 5 లైట్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. గతేడాది లాంచ్ అయిన కూల్ ప్యాడ్ నోట్5 ధర రూ.10,999 కాగ, ఈ ఫోన్ ను రూ.9,999కే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ను కూడా 6,999కే అందుబాటులో ఉంచుతోంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







